రెండు తెలుగు రాష్ట్రాల్లో iBomma రవి ఇష్యూ హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఐ బొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఇటీవల అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇంటర్నెట్ ప్రపంచంలో ఒకప్పుడు ఓటీటీ సంస్థలకు, చిత్ర పరిశ్రమకు కంటి మీద కునుకు లేకుండా చేసిన అతిపెద్ద పైరసీ సామ్రాజ్యం 'ఐబొమ్మ'. ఉచితంగా వినోదం పేరుతో కోట్లాది రూపాయల ఆదాయాన్ని దొంగిలించిన ఈ వెబ్‌సైట్‌ను చేధించడం అసాధ్యం అని అంతా అనుకున్నారు.
దమ్ముంటే పట్టుకోండి అంటూ ఏకంగా పోలీసులకే సవాల్ విసిరిన ఈ అదృశ్య సామ్రాజ్యంపై తెలంగాణ పోలీసులు ఎట్టకేలకు మెరుపుదాడి చేసి, శాశ్వతంగా తాళం వేశారు. కరేబియన్ దీవుల్లో దాగి ఉన్న ఆ పైరసీ సామ్రాజ్యానికి తాళం వేయించారు. సంచలనాత్మక పైరసీ వెబ్‌సైట్లుగా పేరుగాంచిన ఐబొమ్మ , బప్పం టీవీ లపై తెలంగాణ సైబర్‌క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు.
'iBOMMA' సృష్టికర్త రవి జీవిత కథ ఇప్పుడు వెండితెరపైకి రాబోతుండటం సినీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. 'iBOMMA రవి జీవితంపై సినిమా' పేరుతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఈ సినిమా నిర్మాణానికి 'టోస్ట్ క్రియేటివ్ వర్క్స్' అనే సంస్థ ముందుకొచ్చింది. ఈ చిత్రం కేవలం రవి గురించి మాత్రమే కాదు, అతని జీవితంలో జరిగిన వాస్తవ పోరాటాలు, ఎదుర్కొన్న ఒడిదొడుకులు మరియు సవాళ్లను చూపించనుంది.
రవి, అతని టీమ్ గురించిన ప్రపంచానికి తెలియని ఎన్నో చీకటి విషయాలు చూపించబోతున్నాం అని 'టోస్ట్ క్రియేటివ్ వర్క్స్' ప్రకటించింది. ఈ సినిమా ద్వారా డిజిటల్ ప్రపంచంలో, ముఖ్యంగా సినిమా పైరసీ రంగంలో తెరవెనుక జరిగే రహస్యాలు, రవి లాంటి వ్యక్తులు ఎదుర్కొనే లీగల్ సమస్యలు , వారి వ్యక్తిగత జీవితాల ప్రభావాలను ఆసక్తికరంగా చూపించే అవకాశం ఉంది. ఈ సంచలనాత్మక చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


.jpeg)
