Ticker

6/recent/ticker-posts

బంధు మిత్రుల అభినందనలతో.. వెంకట రమణ కేరాఫ్ ఆనంద నిలయం


ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vastunnam) సినిమాతో వందకోట్ల క్లబ్ లో చేరిన విక్టరీ వెంకటేష్ (Venkatesh) జోరు పెంచేశాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు.


MOVIE NEWS: ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vastunnam) సినిమాతో వందకోట్ల క్లబ్ లో చేరిన విక్టరీ వెంకటేష్ (Venkatesh) జోరు పెంచేశాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పటికే మన శంకర వరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu) సినిమాలో చిరుతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న వెంకీ.. త్రివిక్రమ్ (Trivikram)తో వెంకీ 77 ని మొదలుపెట్టాడు. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలతో ఈ కాంబోకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ అవ్వడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.

ఇక ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం షూటింగ్ కూడా జరుపుకుంటుంది. ఈ చిత్రంలో వెంకీ మామ సరసన త్రిష, శ్రీనిధి శెట్టి నటిస్తున్నారని టాక్ నడుస్తోంది. ఇంకోపక్క ఈ సినిమా టైటిల్స్ ఇవే అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చనే నడుస్తోంది. మొదటి నుంచి ఈ చిత్రానికి వెంకట రమణ కేరాఫ్ ఆనంద నిలయం అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు వార్తలు వచ్చాయి. వెంకట రమణ అనే పేరు వెంకీకి చాలా అచ్చొచ్చిన పేరు. చాలా సినిమాల్లో అతని క్యారెక్టర్ నేమ్ అదే కావడంతో ఆ పేరునే టైటిల్ గా అనుకున్నారని సమాచారం.

కొన్నిరోజుల తరువాత ఆ టైటిల్ కాదు కుటుంబరావు అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేశారట అని చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు ఈ రెండు కాకుండా మరో టైటిల్ ని వెంకీ 77 కి కన్ఫర్మ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం వెంకీ - త్రివిక్రమ్ సినిమాకు బంధుమిత్రుల అభినందనలతో అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ కథలు, డైలాగ్స్ కు మాత్రమే కాదు ఆయన టైటిల్స్ కూడా కథను చెప్పేస్తాయి. అలానే ఈ టైటిల్ కూడా కథకు చాలా యాప్ట్ గా ఉండబోతుందని అంటున్నారు. మరి వీటిలో ఏది వెంకీ- త్రివిక్రమ్ టైటిల్ అనేది తెలియాలంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించే వరకు ఆగాల్సిందే.