ANDHRAPRADESH:ఏపీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు. ఇప్పటికే పలువురు వైసీపీ ముఖ్య నేతలు ఈ కేసులో విచారణ ఎదుర్కొన్నారు. అరెస్ట్ అయ్యారు. కేసు విచారణ కొనసాగుతోంది. కాగా, ఇదే కేసులో తాజాగా రిటైర్డ్ ఏఐఎస్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. జగన్ ప్రభుత్వంలో కీలకంగా పని చేసిన ఒక అధికారి పేరు ఇప్పుడు వెలుగులోకి రావటం.. ఆయన పాత్ర పైన చర్చ మొదలైంది. రేపు (శుక్రవారం) విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో సిట్ అధికారులు స్పష్టం చేసారు. దీంతో, ఈ వ్యవహారం ఇప్పుడు కొత్త టర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
వైసీపీ హాయంలో జరిగిన మద్యం స్కాం లో సీనియర్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ పేరు వెలుగు లోకి వచ్చింది. మద్యం పాలసీ రూపకల్పన నుంచి కమీషన్లు తీసుకోవడం వరకూ ఆయన అడుగ డుగునా ఉల్లంఘనలకు పాల్పడినట్లు విచారణలో గుర్తించినట్లు సమాచారం. ఇప్పటికే జైలుకు వెళ్లి రాజ్ కేసిరెడ్డి ఈ వ్యవహారం మొత్తం నడిపిస్తుంటే.. ఎక్సైజ్ పర్యవేక్షించిన రజత్ భార్గవ్ ఎందుకు అభ్యంతరం చెప్పలేదనే అంశం పైన సిట్ విచారణ చేసింది. దీంతో, లోతుగా విచారణ చేసిన అధికారులకు కీలక సమాచారం అందింది. దీంతో.. కొన్ని నెలల క్రితం పదవీ విరమణ చేసిన రజత్ భార్గవకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 11న విజయవాడలోని సిట్ కార్యాల యానికి విచారణకు రావాలని పేర్కొంది.
లిక్కర్ పాలసీ రూపకల్పన నుంచి మద్యం సరఫరా ఆర్డర్ల వరకు జరిగిన అవకతవకల పైన రజత్ భార్గవ్ ను సిట్ విచారించే అవకాశం ఉంది. మద్యం బ్రాండ్లకు అనుమతి వేళ నిబంధనల ఉల్లంఘన పైన ఎందుకు అభ్యంతరం చెప్పలేదనేది కీలకంగా మారుతోంది. మద్యం ఉత్పత్తి, సరఫరాదారులు ఇచ్చిన ముడుపులు ఎవరెవరికి ఇచ్చారు? ఎవరు ఎంత తీసుకున్నారు? అనే విషయాలపై ప్రశ్నించబోతున్నట్లు తెలిసింది. వీటితో పాటు విధాన పరమైన నిర్ణయాలపై ప్రశ్నించి ఆయన ఇచ్చే సమాధానాల తర్వాత చట్టపరమైన చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రజత్ భార్గవ్ ఇచ్చే సమాచారం ఈ మొత్తం కేసులో కీలకంగా మారనుంది.
Social Plugin