Ticker

6/recent/ticker-posts

పేర్ని నానికి మరో షాక్.. తాజా తనిఖీల్లో రూ.3.37 కోట్ల ఫైన్!


Andhrapradesh :రేషన్ బియ్యం మాయం కేసు మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని కుటుంబాన్ని వెంటాడుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ బియ్యం లెక్క పెరుగుతూనే ఉంది.  రేషన్ బియ్యం మాయం కేసు మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని కుటుంబాన్ని వెంటాడుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ బియ్యం లెక్క పెరుగుతూనే ఉంది. గతంలో 187 టన్నుల బియ్యం లేవని గుర్తించిన అధికారులు ఇప్పుడు మరోసారి లెక్కలన్నీ సరిచూసి మొత్తం 378 టన్నుల బియ్యం మాయమయ్యాయని గుర్తించారు. ఈ బియ్యం విలువ రూ. 3.37 కోట్లుగా నిర్ధారించి ఆ మొత్తం ఫైన్ గా చెల్లించాలని తాజాగా మరో నోటీసు జారీ చేశారు. 

మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి చెందిన గొడౌన్లను పౌర సరఫరాల శాఖకు అద్దెకిచ్చారు. పేర్ని నాని భార్య జయసుధ, ఆయన అత్త నత్యానారాయణమ్మ పేర్లతో ఉన్న రెండు గొడౌన్లను అద్దెకు తీసుకున్న ప్రభుత్వం వాటిలో రేషన్ బియ్యాన్ని నిల్వ చేశాయి. ఈ డిసెంబరుతో లీజు కాలం పూర్తికావడంతో బియ్యాన్ని వేరే చోటుకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో నిల్వ చేసిన బియ్యానికి వాస్తవ నిల్వలకు మధ్య తేడా ఉండటంతో తగ్గిన బియ్యం విలువను చెల్లిస్తామని పేర్ని నాని పౌర సరఫరాల శాఖకు లేఖ రాశారు. 

అంతేకాకుండా రూ. 1.70 కోట్లను జిల్లా జాయింట్ కలెక్టరుకు అందజేశారు. కానీ, ప్రభుత్వం మాత్రం మాయమైన బియ్యం ఎటు వెళ్లాయో లెక్క తేల్చాలంటూ పట్టుబడుతోంది. గొడౌన్ యజమాని పేర్ని జయసుధతోపాటు ఆమె సహాయకుడిని నిందితులుగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో పేర్ని జయసుధ అరెస్టుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.