Ticker

6/recent/ticker-posts

సమస్యలు పరిష్కారానికి ప్రజాదర్బార్ ఒక చక్కని వేదిక ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలి.


వచ్చిన ప్రతి ధరఖాస్తును అధికార్లు అత్యంత బాధ్యతతో పరిష్కారం చూపాలి. 
రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ... 


ఏలూరు/ చాట్రాయి, జనవరి 24: చాట్రాయి యంపిడివో కార్యాలయ ప్రాంగణంలో  శనివారం నూజివీడు నియోజకవర్గ స్థాయీ ప్రజాదర్బార్ ను రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నిర్వహించారు. నూజివీడు నియోజకవర్గంలో నాలుగు మండలాలు నుండి వచ్చిన  ప్రజలు నుండి అర్జీలను స్వీకరించి, సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలను అధికార్లు దృష్టికి తీసుకువచ్చి అక్కడికక్కడే పరిష్కరించారు. కొన్ని అర్జీలు క్షేత్రస్థాయిలోకి అధికారులు వెళ్ళి పరిశీలించి పరిష్కారం చూపాలని, జఠిలమైన సమస్యలు ఏమైనా ఉంటే నాదృష్టికి తీసుకురావాలని అధికార్లుకు ఆదేశించారు.

ఈ సంధర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పాలనలో ప్రజలు భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ప్రజలతో నేరుగా మమేకమై సమస్యలు తెలుసుకోవడం ద్వారా వేగవంతమైన పరిష్కారాలు సాధ్యమవుతాయని అన్నారు. ప్రజాసమస్యలు పరిష్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు క్రమం తప్పకుండా ప్రజా ప్రజాదర్బార్ లు నిర్వహించి రికార్డుస్థాయిలో సమస్యలు పరిష్కారం అవుతున్నాయని, ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. 

ప్రతి సోమవారం జిల్లా కలెక్టరు కార్యాలయంతో పాటు అన్ని మండలాలు తహశీల్దార్లు కార్యాలయంలో పిజిఆర్ యస్ ద్వారా అర్జీలు తీసుకుని పరిష్కారాలు చేస్తున్నారని తెలిపారు. రెవెన్యూ సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయని వాటిని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో పిజిఆర్ యస్ కార్యక్రమంతో పాటు అన్ని మండలాలు కవరు అయ్యేలా రెవిన్యూ క్లినిక్లు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్కేక చర్యలు తీసుకుందని తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అత్యంత బాధ్యత తీసుకుందని తెలిపారు.
 
ఈ కార్యక్రమంలోతహశీల్దారు జి.బద్రు, యంపిడివో లు పి.ఏసుబాబు, బి.ఏ. సత్యనారాయణ, వివిధ శాఖలు అధికారులు, ప్రజాప్రతినిధులు, మండల ప్రముఖులు, కూటమి నాయకులు, నియోజకవర్గంలో వివిధ మండలాలు నుండి ప్రజలు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు.