Ticker

6/recent/ticker-posts

కెంద్ర బడ్జెట్ తో రైల్వే బడ్జెట్ విలీనం ...ఎందుకలా ?


INDIA NEWS: ఈ దేశంలో బ్రిటిష్ వారి హయాం నుంచే రైల్వే వ్యవస్థ దేశంలో బలంగా ఉంది. రైల్వేస్ అన్నవి బ్రిటిష్ జమానాలో ఆర్థికంగా ఎంతో కీలకమైనవి. దాంతో రైల్వే బడ్జెట్ ని దేశంలో బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ లో 1924లో తొలిసారిగా ప్రవేశపెట్టరు. అలా రైల్వే బడ్జెట్ అన్నది దేశంలో సొంతంగా ప్రత్యేకంగా ఆరంభం అయింది. కీలకమైనదిగా : ఇదిలా ఉంటే దేశంలో ఆనాటి సమయంలో రైల్వేలు మొత్తం వార్షిక బడ్జెట్‌లో ఏకంగా 84 శాతం వాటాను పైగా ఆదాయాన్ని అందించాయి అందువల్ల సాధారణ బడ్జెట్ నుండి వేరు చేయబడ్డాయి. ఒక విధంగా రైల్వే బడ్జెట్ తోనే దేశం ఎంతో ఆధారపడి ముందుకు సాగింది అని చెప్పాలి. అయితే రాను రాను రైల్వే బడ్జెట్ వాటా తగ్గుతూ వచ్చింది. అలా కాలక్రమేణా ఇతర మంత్రిత్వ శాఖల బడ్జెట్‌లు పెరిగాయి. దాంతో రైల్వే బడ్జెట్ అన్నది చిన్నది అయిపోవడం మొదలైంది. 


తొలిసారిగా రైల్వే బడ్జెట్ : ఇక బ్రిటిష్ ఇండియా పాలనలోమొదటిసారిగా కేంద్ర బడ్జెట్‌ను ఏప్రిల్ 7, 1860 ఏప్రిల్ 7వ తేదీన స్కాటిష్ ఆర్థికవేత్త రాజకీయవేత్త జేమ్స్ విల్సన్ బ్రిటిష్ క్రౌన్‌ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. బ్రిటిష్ వారి పాలన ముగిసిన తరువాత స్వతంత్ర భారత దేశంలో మొదటి కేంద్ర బడ్జెట్‌ను 1947 నవంబర్ 26న అప్పటి ఆర్థిక మంత్రి ఆర్‌కె షణ్ముఖం చెట్టి సమర్పించారు. ఆ సమయంలో ప్రత్యేక రైల్వే బడ్జెట్‌ను రూపొందించడం జరిగింది. ఆ విధంగా రైల్వే బడ్జెట్ అన్నది ప్రత్యేకంగా ప్రవేశపెట్టడం 2017 దాకా స్వతంత్ర భారతదేశంలో కొనసాగుతూ వచ్చింది. 

బ్రేకులు అపుడే : అయితే నరేంద్ర మోడీ 2014లో ప్రధానమంత్రి అయ్యాక 2017లో మాత్రం రైల్వే బడ్జెట్ ని తొలిసారి వేరేగా కాకుండా కేంద్ర ఆర్థిక బడ్జెట్ లో విలీనం చేసి సభకు సమర్పించారు. అలా 1924లో మొదలైన ప్రత్యేక రైల్వే బడ్జెట్ చరిత్ర 93 ఏళ్ళకు ముగిసినట్లు అయింది. బడ్జెట్ అన్నది సరళంగా ఆచరణాత్మకంగా ఉండాలన్న ఆలోచనతోనే మోడీ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ లో విలీనం చేసింది. అలా ఆనాటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రైల్వే బడ్జెట్ తో కలుపుకుని మొత్తం బడ్జెట్ ని సభకు సమర్పించారు. 

నీతి ఆయోగ్ కమిటీ ద్వారా : ప్రత్యేక రైల్వే బడ్జెట్ అన్నది ఎందుకు అని నీతి అయోగ్ సభ్యుడు బిబేక్ దేబ్రాయ్ కమిటీ సారధ్యంలో ఇచ్చిన నివేదిక మేరకు రైల్వే బడ్జెట్ ని రద్దు చేసి కేంద్ర బడ్జెట్ లో విలీనం చేశారు. ఈ మేరకు ఆనాటి కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు కేంద్ర ప్రభుత్వానికి ఈ నివేదికను సమర్పించారు. పార్లమెంట్ లో ఈ అంశం చర్చ తరువాత రెండు బడ్జెట్ లను కలిపేశారు. రెండు బడ్జెట్లు వేరుగా కంటే ఒకటిగా చూపడం వల్ల ఆర్ధిక పరిస్థితి మొత్తం స్పష్టంగా అర్ధం అవుతుందని భావించే ఈ విధంగా చేశారు. 

మొత్తం రవాణా రంగంతో : దేశంలో రవాణా రంగంలో ముఖ్యమైనవిగా రైల్వేస్ ఉన్నాయి. అలాగే రోడ్డు జల రవాణా రంగాలు ఉన్నాయి. కేంద్ర బడ్జెట్ ఈ మూడు రవాణా రంగాలకు సమానమైన ప్రాధాన్యతను ఇస్తూ బడ్జెట్ ని ఒక సమగ్ర రూపానికి తేవడానికి ఈ విలీనం దోహదపడుతోంది అని అంటున్నారు. బహుముఖీయమైన రవాణా రంగం అభివృద్ధి మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడానికి వీలు కల్పిస్తుందని కూడా అంటున్నారు. మొత్తం మీద రైల్వే బడ్జెట్ విలీనం ద్వారా ఈ పదేళ్ళలో రైల్వే శాఖ గణనీయమైన ఆర్థిక ప్రగతితో పాటు నిధులలో వాటాను పెంచుకుందని అంటున్నారు.