Ticker

6/recent/ticker-posts

కె విజయలక్ష్మి కుటుంబానికి అండగా మంత్రివర్యులు కొలుసు పార్ధసారధి


విజయలక్ష్మి కుటుంబానికి అండగా కూటమి ప్రభుత్వం మంత్రివర్యులు


నూజివీడు/ముసునూరు/,జనవరి:25: ముసునూరు మండలం ముసునూరు గ్రామ సర్పంచ్ కె, విజయలక్ష్మి భర్త యిర్మీయా ఇటీవల మరణించిన  సంగతి తెలుసుకొని  రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారధి  కుటుంబ సభ్యులను కలిసి పేరు పేరున పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటానని మాట్లాడి ధైర్యం చెప్పిన మంత్రి, కుటుంబానికి  కూటమి ప్రభుత్వం తరుపున వచ్చే పలు సంక్షేమ అభివృద్ధి పథకాలు అందిస్తామని మంత్రివర్యులు అన్నారు. 

యిర్మీయా కుటుంబాన్ని అన్ని విధాలుగా  ఆదుకుంటానన్న మంత్రివర్యులు. మరియు తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా అదుకుంటుందన్నారు, మంత్రి.పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబానికి ప్రభుత్వం అన్ని వేళలా ఆదుకుంటుందని మంత్రివర్యులు అన్నారు.విజయలక్ష్మి కుటుంబానికి అండ దండగా ఉంటానని నా వంతు సహాయ,సహకారాలు అందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. కుటుంబానికి అండ దండగా నా వంతు సహాయ సహకారం అందిస్తామన్నారు.మంత్రివర్యులు వెంట  తెలుగుదేశం, నాయకులు కార్యకర్తలు తదితర పెద్దలు,పాల్గొన్నారు.