TELANGANA: ఇపుడు ఈ కేసు విషయంలో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది.
ఇప్పటికి పదకొండేళ్ళ క్రితం ఓటుకు నోటు కేసు అతి పెద్ద రాజకీయ సంచలనం అయింది. అయితే ఈ కేసు విషయంలో ఆనాడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం గట్టిగా వ్యవహరించి కేసులను నమోదు చేసింది. ఆ మీదట ఈ కేసు అలా కొనసాగుతూ వస్తోంది. ఇపుడు ఈ కేసు విషయంలో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. దాంతో తెలంగాణా ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి సుప్రీం కోర్టులో తాను దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ లో కీలకమైన అంశాలను పేర్కొన్నారు.
ఆ చట్టం వర్తించదు : ఈ కేసు విషయంలో సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ న్లను రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు సండ్ర వెంకటవీరయ్య దాఖలు చేశారు. వీటి మీద జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌తో కూడిన ప్రత్యేక ధర్మాసనం విచారణ చేపట్టనుంది.అయితే ఓటుకు నోటు కేసు విచారణను సుప్రీంకోర్టు రెండు వారాల పాటు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే ఈ కేసును ఎన్నికల చట్టాల కింద విచారణ చేయాలన్నది రేవంత్ రెడ్డి సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. అసలు అవినీతి నిరోధక చట్టం అన్నది ఈ కేసుకు ఏ మాత్రం వర్తించదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఆధారాలు లేవు : మరో వైపు చూస్తే బీఆర్ఎస్ నాయకుడు సండ్ర వెంకట వీరయ్య అయితే తన పేరుని ఈ కేసు నుంచి తొలగించాలని పిటిషన్ లో పేర్కొనడం విశేషం. ఈ కేసులో తన మీద వచ్చిన ఆరోపణల మీద ఆధారాలు సరైనవి లేవని ఆయన పిటిషన్ లో పేర్కొనడం విశేషం. ఇలా సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు సండ్ర వెంకట వీరయ్య వేరు వేరుగానే పిటిషన్లు దాఖలు చేశారు. కానీ ఇపుడు సుప్రీం కోర్టు మాత్రం రెండు పిటిషన్లను కలిపి విచారణ చేయడానికి నిర్ణయించింది
ఉత్కంఠగా మారిన వైనం : ఓటుకు నోటు కేసు మొదటి నుంచి సంచలనంగానే ఉంది. అయితే రేవంత్ రెడ్డి పేర్కొన్నట్లుగా ఇది ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పెట్టిన కేసు దాంతో ఎన్నికల ఉల్లంఘనగా చూడాలని ఆయన అంటున్నారు. దీనిని అవినీతి నిరోధక చట్టానికి సంబంధం లేదని చెబుతున్నారు. అలాగే సండ్ర పిటిషన్ లో పాయింట్లు ఉన్నాయి. దాంతో ఈ కేసు విచారణ మరో రెండు వారాలలో జరగనుంది అత్యున్నత న్యాయ స్థానం ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.

