Ticker

6/recent/ticker-posts

తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్య, బెంగళూరుకు వందేభారత్ స్లీపర్ -రూట్, షెడ్యూల్..!!


ANDRAPRADESH:తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ సేవలకు ఆదరణ పెరుగుతోంది. కొత్తగా వస్తున్న వందేభారత్ స్లీపర్ రైళ్లు తెలుగు రాష్ట్రాల్లో మొదలు కానున్నాయి. ఇప్పటికే పలు ప్రతిపాదనలు రైల్వే బోర్డు వద్ద పెండింగ్ లో ఉండగా... దశల వారీగా అమలుకు నిర్ణయించారు. తొలి విడతలో రెండు సర్వీసుల ను తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. తుది జాబితాలో మార్పులు జరిగితే మినహా.. ఈ రెండు రూట్లలో వందేభారత్ స్లీపర్ ప్రారంభం కానున్నాయి.

పట్టాలెక్కనున్న స్లీపర్ 

తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ రైళ్లకు ఆశించిన స్థాయిలో ఆక్యెపెన్సీ ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇక, ఏపీ నుంచి దూరపు ప్రాంతా లకు చేరుకునేందుకు వందేభారత్ స్లీపర్ రైళ్ల కేటాయింపు పైన తెలుగు రాష్ట్రాల ఎంపీల నుంచి రైల్వే శాఖకు పలు ప్రతిపాదనలు అందాయి. అందులో భాగంగా విశాఖ నుంచి తిరుపతి, విశాఖ నుంచి బెంగళూరు కు వందేభారత్ స్లీపర్ కేటా యించాలని ఇప్పటికే కేంద్ర మంత్రులు.. ఎంపీలు నేరుగా రైల్వే మంత్రిని కలిసి వితని పత్రాలు సమర్పించారు. విజయవాడ నుంచి బెంగళూరుకు వందేభారత్ ఏర్పాటు పైన అధ్యయనం కొన సాగుతోంది. విజయవాడ నుంచి చెన్నైకు ప్రస్తుతం వందేభారత్ కొనసాగుతోంది. బెంగళూరుకు ఏర్పాటు చేయటం ద్వారా ప్రయోజన కరంగా ఉంటుందనే వినతులు రైల్వే బోర్డుకు చేరాయి.

రెండు మార్గాల్లో 

అయితే, వందే భారత్ స్లీపర్ కోసం దేశ వ్యాప్తంగా వస్తున్న డిమాండ్ ను పరిగణలోకి తీసుకొని కేటాయింపు లు చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. కానీ, ఇదే సమయంలో ఏపీ నుంచి అయోధ్య, వారణాసి కి వందేభారత్ స్లీపర్ కేటాయింపులో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని రైల్వే మంత్రిని ఏపీకి చెందిన ప్రజా ప్రతినిధులు కోరారు. దీని ద్వారా ఏపీ నుంచి రెగ్యులర్ రైళ్లల్లో అయోధ్య, వారణాసి వెళ్లే వారికి ప్రయోజన కరంగా ఉంటుందని వివరించారు. ఈ ప్రతిపాదనకు తొలి జాబితాలోనే ప్రక టన ఉండనున్నట్లు సమాచారం. దీంతో, వందేభారత్ విజయవాడ నుంచి అయోధ్య, వారణాసి కి కేటాయింపు ఖాయంగా కనిపిస్తోంది. జయవాడ నుంచి వరంగల్ మీదుగా ప్రస్తుతం రెగ్యులర్ రైళ్లు ప్రయాణించే మార్గంలోనే వందేభారత్ స్లీపర్ ను అయోధ్య కు కేటాయించేలా నిర్ణయం ఉంటుంద ని తెలుస్తోంది. రాత్రి సమయంలోనే ఈ రైలు ఉండేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

విశాఖ - బెంగళూరు

ఈ రైలు అందుబాటులోకి వస్తే అయోధ్య, వారణాసి వెళ్లాలనుకునే తెలుగు ప్రజలకు వరంగానే భావించాలి. అదే విధంగా విశాఖ నుంచి తిరుపతి, విశాఖ నుంచి బెంగళూరు, విశాఖ నుంచి న్యూ ఢిల్లీ మీదుగా వందేభారత్ స్లీపర్ రైళ్ల కోసం వినతి పత్రాలు అందాయి. అయితే, విశాఖ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు వందేభారత్ స్లీపర్ ఏర్పాటు పైన రైల్వే బోర్డు ప్రతిపాదనలు స్వీకరించినట్లు సమాచారం. అదే విధంగా.. సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీకి వందేభారత్ స్లీపర్ ఏర్పాటు పైన చర్చలు జరుగుతున్నాయి. ప్రయాణీకుల ఆదరణ .. ప్రస్తుత రైళ్లకు డిమాండ్ వంటికి పరిగణలోకి తీసుకొని ఈ కొత్త ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతున్నారు. ఆగస్టు లో కొత్తగా వందేభారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి.