Ticker

6/recent/ticker-posts

SIR కార్యక్రమంపై సమీక్ష సమావేశం


ఏలూరు జిల్లా పరిధిలో ఓటరు జాబితా సవరణపై కీలక సూచనలు

భీమడోలు, జూలై 21: రాష్ట్ర ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంపై రాష్ట్ర ఇన్‌చార్జి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భీమడోలు గీతాంజలి కళాశాలలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏలూరు జిల్లా పరిధిలోని ఏడు నియోజకవర్గాల BLA-1లు, అసెంబ్లీ టోలీ సభ్యులు, పార్టీ నాయకులు సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా SIR కార్యక్రమం పురోగతి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, BLOలు మరియు BLA-2ల బాధ్యతలు, ఓటరు ధృవీకరణ ప్రక్రియ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. సమావేశంలో ప్రతినిధులు వ్యక్తం చేసిన సందేహాలకు రాష్ట్ర ఇన్‌చార్జి సమగ్ర వివరణ ఇచ్చారు.

నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రతి BLO ఇంటింటికీ వెళ్లి సంబంధిత ఓటరును ప్రత్యక్షంగా కలుసుకుని ఎన్యుమరేషన్ ఫారాన్ని అందజేయాలని సూచించారు. ఓటరును కలవకుండా ఇతరుల ద్వారా ఫారాలు పంపించడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు.

ఓటర్లు ఇంటి వద్ద అందుబాటులో లేని సందర్భాల్లో BLOలు నోటీసులు ఇవ్వడంతో పాటు అవసరమైతే మూడుసార్లు వరకు సందర్శించాలని పేర్కొన్నారు. ఎక్కడైనా నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తిస్తే, తగిన ఆధారాలతో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి లిఖితపూర్వక ఫిర్యాదులు సమర్పించాలని BLAలకు సూచించారు.

చనిపోయిన వ్యక్తుల పేర్లు, బహుళ ఓట్లు, అనుమానాస్పద ఓట్లపై ఎన్నికల సంఘం ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తుందని, ఆ సమయంలో అభ్యంతరాలను అధికారికంగా నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ప్రతి అర్హ ఓటరికి ఎన్యుమరేషన్ ఫారం నేరుగా అందేలా చూడటమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

సమావేశంలో BLA-1లు, అసెంబ్లీ టోలీ సభ్యులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. చింతలపూడి నియోజకవర్గానికి చెందిన కొప్పాక శ్రీనివాసరావు, కుంచాడ దుర్గా వరప్రసాద్, మురళీ వర్మ, సొలస నాగ రవికుమార్ తదితరులు హాజరయ్యారు.