Ticker

6/recent/ticker-posts

భారతీయ ఆధ్యాత్మిక కళ యోగా విశ్వవ్యాప్తంగా మన్ననలు పొందడం గర్వకారణం: జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి


ఏలూరు, జూన్ 21: భారతీయ ఆధ్యాత్మిక సంపద అయిన యోగా నేడు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ, మన్ననలు పొందడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని జిల్లా కలెక్టర్ K. Vetri Selvi కె. వెట్రిసెల్వి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026 సందర్భంగా ఆదివారం ఏలూరు సమీపంలోని వట్లూరు టిటిడిసి కేంద్రంలో నిర్వహించిన యోగాభ్యాస కార్యక్రమంలో ఆమె పాల్గొని యోగా ఆసనాలు వేశారు.


ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే Badeti Radha Krishnaiah బడేటి రాధాకృష్ణయ్య (చంటి), జిల్లా ఎస్పీ K. Pratap Shiva Kishore కె. ప్రతాప్ శివకిషోర్, జిల్లా జాయింట్ కలెక్టర్ M. J. Abhishek Gowda డా. ఎం.జె. అభిషేక్ గౌడ, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ రీజియన్ చైర్మన్ Reddy Appala Naidu రెడ్డి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి N. Chandrababu Naidu నారా చంద్రబాబు నాయుడు, ప్రముఖ యోగా గురువు Baba Ramdev బాబా రాందేవ్ పాల్గొన్న విజయవాడ రాష్ట్రస్థాయి యోగా వేడుకల ప్రత్యక్ష ప్రసారాన్ని యోగా అభ్యాసకులు వీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ గత 15 రోజులుగా జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. యోగా ఆరోగ్యానికి ఒక దివ్య ఔషధమని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పటివరకు నేర్చుకున్న యోగా సాధనలను కొనసాగిస్తూ ప్రతిరోజూ అభ్యాసం చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సాధించవచ్చన్నారు.

విద్యార్థులు ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందించి చదువులో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేసి యోగాంధ్ర కార్యక్రమాలను విజయవంతం చేశారని అభినందించారు.

ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ యోగా ఆరోగ్యవంతమైన భారతదేశ నిర్మాణానికి ఎంతో అవసరమని అన్నారు. దేశ యువత ఆరోగ్యంగా ఉండేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యోగాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయని తెలిపారు.

జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని సూచించారు. యోగాభ్యాసం ద్వారా యువత మేధస్సును పెంపొందించుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయడమే కాకుండా మరో ముగ్గురిని కూడా యోగా వైపు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో యోగాంధ్ర నిర్వహణలో విశేష కృషి చేసిన జిల్లా అధికారులను కలెక్టర్, ఎమ్మెల్యేలు శాలువాలతో సన్మానించారు. అలాగే జిల్లా స్థాయి యోగా పోటీల్లో ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయికి ఎంపికైన 23 మంది విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ పి. జగదాంబ, ఇన్‌చార్జి డీఆర్వో ఎల్. దేవకీదేవి, ఆర్డీవో కె. లక్ష్మీప్రసన్న, ఆయుష్ రీజినల్ డీడీ డా. పి. కృష్ణవేణి, వివిధ శాఖల అధికారులు, మాస్టర్ ట్రైనర్లు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.