Ticker

6/recent/ticker-posts

నందమూరి బాలకృష్ణ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం


ఎన్‌బీకే ఫేవరెట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

జంగారెడ్డిగూడెం, జూన్ 12: ప్రముఖ సినీ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే Nandamuri Balakrishna నందమూరి బాలకృష్ణ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహిస్తున్న మూడు రోజుల సేవా కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం స్థానిక సీతామహాలక్ష్మి దివ్యాంగుల వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కింగ్ ఆఫ్ కింగ్స్ నందమూరి బాలకృష్ణ ఫేవరెట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా అభిమాన సంఘ సభ్యులు వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి, "జై బాలయ్య.. జై జై బాలయ్య" నినాదాలతో సందడి చేశారు. అనంతరం వృద్ధాశ్రమంలోని వృద్ధులు, దివ్యాంగులకు అన్నప్రసాదం పంపిణీ చేసి, స్వీట్లు అందజేశారు. బాలకృష్ణ సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.

ఎన్‌బీకే ఫేవరెట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాగాని శ్రీను మాట్లాడుతూ, అభిమానులు కేవలం సంబరాలకే పరిమితం కాకుండా సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. సమాజంలో అవసరమైన వారికి అండగా నిలవడం ద్వారా బాలకృష్ణ అభిమానుల సేవా దృక్పథం ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మారిశెట్టి బాలకృష్ణ, చిటికెన రాంబాబు, తడికమళ్ల రాజశేఖర్, రాగాని శ్రీను, పొదిలి కమలదాస్, జుత్తుగ శ్రీను, కలపాల శ్రీనివాస్, సూరవరపు హరీష్, చింతపల్లి శ్రీనివాసరావు, రొంగల బ్రదర్స్ తదితర అభిమాన సంఘ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఎన్‌బీకే ఫేవరెట్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి చిటికెన రాంబాబు కృతజ్ఞతలు తెలిపారు.

రాబోయే రోజుల్లో కూడా బాలకృష్ణ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాలకు సహకరించదలచిన దాతలు, అభిమానులకు ప్రత్యేక అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.