ANDRAPRADESH, ELURU, JUN 06: ఈనెల 28వ తేదీన నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. యు. శోభ వైద్య సిబ్బందిని ఆదేశించారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం పల్స్ పోలియో నిర్వహణపై వైద్యాధికారులకు ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డా. శోభ మాట్లాడుతూ పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లాలో ఉన్న మొత్తం 1,64,874 మంది 05 సంవత్సరాలలోపు చిన్నారులకు చేరే విధంగా సమర్థవంతంగా అమలు చేయాలని, ఏ ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు పొందకుండా మిగిలిపోకుండా ప్రత్యేక శ్రధ వహించాలని డా.శోభ సూచించారు. శిక్షణలో భాగంగా పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించి ముందస్తు ఏర్పాట్లు, ఐస్ ప్యాక్స్ తయారీ మరియు నిర్వహణ, వ్యాక్సిన్ వైల్ మానిటర్ (VVM) యొక్క ప్రాముఖ్యత, పోలియో బూత నిర్వహణ, రెండు మూడు రోజులలో నిర్వహించవలసిన ఇంటింటి పోలియో చుక్కల కార్యక్రమం (House-to-House Activity). ట్రాన్సిట్ పాయింట్ల వద్ద చేపట్టాల్సిన చర్యలు, హైరిస్క్ ప్రాంతాలలో తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై సవివరంగా అవగాహన కలిగించారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో ఏలూరు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCs) మరియు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (UPHCs)లకు చెందిన వైద్యాధికారులు మరియు సూపర్వైజర్లు , జిల్లా ప్రోగ్రాం అధికారులు డివిజనల్ అధికారులు అధికారులు, సూపర్వైజర్లు మరియు సంబంధిత ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

