ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు అద్భుతమైన అవకాశాలు కల్పిస్తోంది. చదువు మధ్యలో ఆపేసిన వారికి, నైపుణ్యాలు నేర్చుకోవాలనుకునే వారికి ఉచిత శిక్షణ అందిస్తోంది. టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలకు సిద్ధం చేసేందుకు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసింది. కంప్యూటర్ బేసిక్స్, టాలీ, డిజిటల్ మార్కెటింగ్ వంటి కోర్సులతో పాటు, డిమాండ్ ఉన్న వృత్తుల్లో శిక్షణ ఇచ్చి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీతో చదువు ఆపేసిన వారికి ఉద్యోగాలు కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. వీరిని ఉద్యోగాల దిశగా సన్నద్ధం చసేందుకు ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసింది. ఈ సెంటర్లలో ఉచితంగా శిక్షణ అందిస్తారు.. ఆ తర్వాత వారి అర్హతను బట్టి వివిధ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తారు. చదువు మధ్యలో ఆపేసిన వారికి లేదా నిర్దిష్ట వృత్తి నైపుణ్యాలు నేర్చుకోవాలనుకునే వారికి అవకాశాలు కల్పిస్తున్నారు.

డిగ్రీ చదువుతూనే ఉద్యోగ నైపుణ్యాలు నేర్చుకునేందుకు ప్రభుత్వం డిగ్రీ కాలేజీల్లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో ఏఐ ఫండ్‌మెంటల్స్, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ట్యాలీ విత్ జీఎస్టీ, డిజిటల్ మార్కెటింగ్ వంటి కోర్సులు నేర్పిస్తున్నారు. గతంలో డిగ్రీ పూర్తయ్యాక కోర్సులు నేర్చుకునేవారు.. కానీ ఇప్పుడు చదువుతూనే ఉద్యోగానికి సిద్ధమయ్యే అవకాశం కల్పించారు. ఇంజినీరింగ్ కాలేజీల్లో కూడా ఈ ప్రత్యేక శిక్షణ కేంద్రాలు నడుస్తున్నాయి. విద్యార్థులు చదువుతో పాటు ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు. ఈ శిక్షణ వల్ల విద్యార్థులు డిగ్రీ పూర్తయ్యేలోపే ఉద్యోగాలకు సన్నద్ధం కావొచ్చు.
ఆయా జిల్లాల్లో విద్యార్థులు ఎవరైనా ఈ సెంటర్లలో శిక్షణ తీసుకోవచ్చు. నైపుణ్య పోర్టల్ https://naipunyam.ap.gov.in/ లో పేరు నమోదు చేసుకోవాలి. ఈ సెంటర్లలో ఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు కొత్త బ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో వివరాలు చూసుకుని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సెంటర్లలో ఆయా పరిశ్రమలు, కంపెనీలకు అవసరమైన విధంగా శిక్షణ ఇస్తారు. అంతేకాదు ఏ రంగంపై ఆసక్తి ఉందో గుర్తించి అవసరమైన శిక్షణ కూడా ఇస్తారు. అంతేకాదు జిల్లాస్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నారు.. ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

.jpeg)