Ticker

6/recent/ticker-posts

జనసేనకు భారీ లోటు అదే... వ్యూహం రెడీ ?


ANDRAPRADESH: ఏపీలో మూడవ రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన జనసేన నెమ్మదిగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతోంది. పాతికేళ్ళ పాటు రాజకీయాల్లో ఉంటాను అని 2014లో ప్రకటించి మరీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వారు పవన్ కళ్యాణ్. అందుకు తగినట్లుగానే తొలి ఎన్నికల్లో పోటీ చేయలేదు. బీజేపీకి టీడీపీకి మద్దతు ఇచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో పోటీ చేశారు, అయితే తాను పోటీ చేసిన రెండు సీట్లలో ఓటమి చవి చూసారు. ఇక 2024లో టీడీపీ బీజేపీలతో కలసి భారీ పొత్తునే కుదిర్చారు. అలా ఏపీ రాజకీయాలను మలుపు తిప్పేలా అధ్బుతమైన ఫలితాలను సాధించారు. 


కట్ చేస్తే డిప్యూటీ సీఎం : 
ఇక ఏపీలో కూటమి ప్రభుత్వంలో జనసేన కీలక పాత్ర పోషిస్తోంది. ఉప ముఖ్యమంత్రి వంటి పదవిని పవన్ అందుకున్నారు. చంద్రబాబు తరువాత స్థానంలో ఆయన ఉన్నారు. రాజకీయంగా ఈ అవకాశాన్ని జనసేన వాడుకుంటోంది. అయితే అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు కావస్తున్నా జనసేన ఇంకా గట్టిగా తన ప్రభావం చూపించలేకపోతోంది. విస్తరించాల్సిన తీరులో ముందుకు సాగడం లేదు అన్నది ఉంది అంతే కాదు జనసేన మీద విమర్శలు వస్తే గట్టిగా రియాక్ట్ అయి మరోసారి వాటిని రిపీట్ చేయనీయకుండా లాజిక్ తో దెబ్బకొట్టి అవతల పెట్టే వారు లేకుండా పోయారు అన్నది ఉంది. ఇదే జనసేనకు అతి పెద్ద కొరత లోటు అని అంటున్నారు. 

అధికార ప్రతినిధులు కావాలి : 
జనసేన పార్టీ వాయిస్ వినిపించాలి అన్నా లేక ప్రభుత్వం లో ఉంటూ తాము చేస్తున్నది ఎప్పటికపుడు జనాలకు చేరువ చేసే వారు కావాలీ అంటే తప్పకుండా అధికార ప్రతినిధులు ఉండాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. వైసీపీ చేస్తున్న విమర్శలను ధీటుగా ఎదుర్కొని జవాబు చెప్పేవారు కావాల్సి ఉంది. అంతే కాదు టీవీ డిబేట్ లో సమర్ధంగా పార్టీ ఫిలాసఫీని ముందు పెట్టి ప్రత్యర్ధుల నోర్లు మూయించే వారు కూడా అవసరం ఉంది అంటున్నారు. 

విశాఖ పార్టీ మీట్ లో అదే : 
ఇక తాజాగా విశాఖ వేదికగా మూడు రోజుల పాటు జనసేన నిర్వహించిన పార్టీ సమావేశాలలో ఇదే అంశం మీద చర్చ సాగింది అని అంటున్నారు. జనసేనకు సమర్ధులు అయిన అధికార ప్రతినిధులు ఉంటే పార్టీ ప్రభుత్వం మీద వచ్చే విమర్శలను తిప్పికొడతారు అని అభిప్రాయం అయితే వ్యక్తం అయింది అని అంటున్నారు. దీని మీద కూడా అధినాయకత్వం అందరి అభిప్రాయాలను తీసుకుందని అంటున్నారు. 

త్రిశూల్ వ్యూహం అదేనట : 
ఇక జనసేన ప్రకటించిన త్రిశూల్ వ్యూహం అదే అని అంటున్నారు. ఈ వ్యూహంలో భాగంగా ముగ్గురు రాష్ట్ర స్థాయి అధికార ప్రతినిధులను వీలైనంత తొందరలో నియమిస్తారు అని అంటున్నారు. వీరి ద్వారా పార్టీని ప్రభుత్వాన్ని బలంగా మరింత పెద్ద ఎత్తున జనంలోకి తీసుకుని వెళ్తారు అని అంటున్నారు. వైసీపీ వంటి పార్టీలు చేసే విమర్శలకు బలంగా జవాబు చెప్పాల్సిన అవసరం గురించిన జనసేన అధినాయకత్వం ఈ విధంగా పార్టీలో చర్యలు తీసుకోనుందని అంటున్నారు. చూడాలి మరి ఆ నియామకాలు ఎపుడు జరుగుతాయో.