Ticker

6/recent/ticker-posts

టీటీడీలో వారిని తప్పించాల్సిందే - బండి సంజయ్ సంచలన డిమాండ్..!!


ANDHRAPRADESH:కేంద్ర మంత్రి బండి సంజయ్ టీటీడీని కీలక డిమాండ్ చేసారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకు న్న బండి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. టీటీడీ లో నిర్ణయాల పైన స్పందించారు. తెలుగు రాష్ట్రా ల్లో ధూప దీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలతోపాటు పురాతన ఆలయాలను టీటీడీ అభివృద్ధి చేయాలని సూచించారు. శ్రీవారి ఆలయంలో నిజమైన భక్తి.. చిత్తశుద్ది ఉన్నవారికి మాత్రమే అవకాశం కల్పించాలని బండి సంజయ్ సూచించారు.

తిరుమలలో అన్యమత ఉద్యోగస్థుల వ్యవహారం పైన కేంద్ర మంత్రి బండి సంజయ స్పందిం చారు. తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్న బండికి ఆలయ అర్చకులు స్వామివారి తీర్ధ ప్రసా దాలను అందజేశారు. టీటీడీలో 1000 మందికి పైగా అన్యమతస్థులు పని చేస్తున్నారని తెలి పారు. టీటీడీలో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులకు హిందూ సనాతన ధర్మంపై విశ్వాసం లేద న్నారు. టీటీడీ పాలకమండలి వెంటనే స్పందించి వారందరినీ తొలగించాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఓ ఉద్యోగిని తొలగించడంపై స్పందించిన కేంద్రమంత్రి.. ఒకరిని తొలగిస్తే సరిపోదని, టీటీడీలోని అన్యమత ఉద్యోగస్థులందరినీ గుర్తించి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.

అన్యమస్థులపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ధూప దీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలతోపాటు పురాతన ఆలయాలను టీటీడీ అభివృద్ధి చేయాలని సూచించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఇల్లెందు రామాలయం, కొండగట్టు ఆంజనేయ స్వామి, వేములవాడ ఆలయాల అభివృద్ధికి టీటీడీ సహకారం అందించాలని కేంద్రమంత్రి కోరారు. శ్రీవారి సేవలో నిజమైన భక్తి, నిబద్ధతతో పనిచేసే వారికే అవకాశం కల్పించాలని సూచిం చారు. అన్ని మతాల వారిని ఆదరించటానికి టీటీడీ సత్రం కాదని కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ఏ ఒక్కరి ఆస్తి కాదని.. హిందువులు అందరిదీ అని చెప్పుకొచ్చారు. సనాతన ధర్మం కోసం అందరూ ఐక్యంగా ఉండాలని సూచించారు.