Ticker

6/recent/ticker-posts

ఏపీలో ఇంటి నిర్మాణ అనుమతులపై అదిరిపోయే శుభవార్త.. కానీ ట్విస్ట్ ఏంటంటే!


ANDHRAPRADESH:ఏపీలో పరిపాలన సులభతరం చేయడంతో పాటు, ప్రజలకు సేవలను త్వరితంగా అందించడానికి సంకల్పించిన ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు సొంతింటి కల నిజం చేసుకోవడానికి తీపి వార్త చెప్పింది. ఇకపై అనుమతుల కోసం ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా, కొత్తగా స్వీయ ధ్రువీకరణ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఇంటి నిర్మాణ అనుమతులకు స్వీయ ధృవీకరణ పథకం

ప్రభుత్వం ఈ మేరకు మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. నగరాలు పట్టణాలలో ఇల్లు కట్టుకునే వారికి ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది. పేద మధ్యతరగతి ప్రజల సొంతింటి కల తీరుతుంది. ఇల్లు, భవనాలు నిర్మించాలి అనుకునేవారు స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లను, ఎక్కడైతే ఇంటి నిర్మాణం చేయాలనుకుంటున్నారో ఆ ఖాళీ స్థలానికి సంబంధించిన ఫోటో, పన్ను రసీదు వంటివి లైసెన్స్ ఉన్నటువంటి సాంకేతిక నిపుణులకు ఇవ్వాలి.

ఇంటి నిర్మాణ అనుమతి ఇకపై ఈజీ 

వాటిపై సంతకాలు చేసి, ఫీజులు చెల్లిస్తే ఎల్ పి టి ఇంటి ప్లాన్ గీసి, అవసరమైన పత్రాలను జతచేసి ఫీజు చెల్లించిన రసీదు తో సహా dpms డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్ లో వాటిని అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత వెంటనే ఇంటి నిర్మాణ అనుమతి ప్రొసీడింగ్ కాపీ వచ్చేస్తుంది. ప్రొసీడింగ్ కాపీ తీసుకున్న తర్వాత ఇంటి నిర్మాణ పనులను మొదలు పెట్టొచ్చు. ఇక ఈ విధానంలో చాలా సులభంగా ఇంటి నిర్మాణాన్ని చేసుకోవచ్చు.

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు 

అయితే ఇదే సమయంలో అనుమతులను సులభతరం చేసిన ప్రభుత్వం, గృహనిర్మాణం విషయంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తే నోటీసులు ఇచ్చి, అనుమతులను రద్దు చేస్తామని ప్రకటించింది. అంతేకాదు తప్పుడు పత్రాలతో అనుమతులు తీసుకుంటే ఎల్ టి పి ల లైసెన్సును కూడా ఐదేళ్లపాటు రద్దు చేస్తామని ప్రభుత్వ హెచ్చరించింది. నిర్మాణాలకు అనుమతులను సులభతరం చేసి, రూల్స్ అతిక్రమిస్తే క్షమించేది లేదని తేల్చి చెప్పింది.

అలా చేస్తే అనుమతులు రద్దు 

కచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్లాన్ ప్రకారమే నిర్మాణాలు చేయాలని ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు ఎల్ టి పి లు పరిశీలించి టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కు రిపోర్ట్ చేస్తారని, అనంతరం టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా ఇంటి నిర్మాణాలను పరిశీలించి, నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటారని ప్రభుత్వం పేర్కొంది. ఒకవేళ ఇల్లు, భవనాలు నిర్మించే ప్రదేశంలో నిబంధనల ప్రకారం ఖాళీ స్థలం వదలడంలో తేడా చేసినా , ఒకవేళ పర్మిషన్ లేకుండా అదనపు ఫ్లోర్లు నిర్మించినా భవనానికి సంబంధించిన అనుమతులను రద్దు చేసి చర్యలు తీసుకుంటారు.