HYDERABAD:తెలంగాణ పైన బీజేపీ నాయకత్వం స్పెషల్ ఫోకస్ చేసింది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణా మాలను తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తోంది. అందులోనూ గ్రేటర్ పరిధిలో పట్టు పెంచుకునేందుకు కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. రాష్ట్ర పార్టీ కొత్త అధ్యక్షుడి నియామకం తరువాత గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటోంది. రాజాసింగ్ రాజీనామా ఆమోదించి న పార్టీ నాయకత్వం.. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే పదవి పైన అనర్హత వేటు కోసం స్పీకర్ కు లేఖ రాయాలని నిర్ణయించింది. రాజాసింగ్ స్థానంలో పార్టీ ఫైర్ బ్రాండ్ ను రంగంలోకి దించుతోంది.
కీలక నిర్ణయం
గ్రేటర్ హైదరాబాద్ గత ఎన్నికల్లో అనూహ్యంగా బలం పెంచుకున్న బీజేపీ.. ఇప్పుడు రానున్న ఎన్నికల కోసం సిద్దం అవుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం వ్యూహాలకు ధీటుగా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని ఆదేశించింది. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల తరువాత పూర్తిగా గ్రేటర్ పైన ఫోకస్ పెట్టాలని ఆదేశించింది. ఇదే సమయంలో నగరంలో పార్టీకి కీలకంగా వ్యవహరించిన రాజాసింగ్ రాజీనామాను పార్టీ ఆమోదించింది. పార్టీ సింబల్ పైన గెలిచిన రాజాసింగ్ పైన అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు లేఖ రాసేందుకు పార్టీ నిర్ణయించినట్లు సమా చారం. స్పీకర్ ఆమోదిస్తే జూబ్లీహిల్స్ తో పాటుగా గోషా మహల్ కు ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. దీంతో..గోషా మహల్ స్థానంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది.
రాజాసింగ్ స్థానంలో
రాజాసింగ్ పార్టీని వీడటంతో.. ఆయన స్థానంలో మరో నేత కు గోషామహల్ బాధ్యతలు అప్పగించా లని పార్టీ నిర్ణయించింది. 2024 ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి పార్టీ ఏరి కోరి ఎంపీ అభ్యర్దిగా ఖరారు చేసి ఎంఐఎం అధినేత అసద్ పై పోటీకి దింపిన మాధవీ లతకు గోషామహల్ బాధ్యతలు ఇచ్చేందుకు రంగం సిద్దమైంది. గోషామహల్ లో పార్టీ పట్టు జారకుండా మాధవీ లత వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. గోషామహల్ నుంచి బీజేపీ అభ్యర్దిగా రాజాసింగ్ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఆయన ఎమ్మెల్యే పదవి పైన పార్టీ కోరుకుంటున్నట్లుగా అనర్హత వేటు పడితే బీజేపీ అభ్యర్దిగా మాధవీ లత ను బరిలోకి దింపాలని డిసైడ్ అయ్యారు. అందు కోసం ఇప్పటి నుంచే నియోజకవర్గంలో మాధవీ లతకు బాధ్యతలు కేటాయిస్తున్నారు.
ఎంపిక వెనుక
మాధవీ లతను 2024 ఎన్నికల సమయంలో బీజేపీ నాయకత్వం ఏరి కోరి ఎంపిక చేసింది. విరించి ఆస్పత్రుల చైర్ పర్సన్ గా ఉన్న కొంపెల్లి మాధవీ లత హిందూ ధార్మిక కార్యక్రమాలతో పాటుగా క్లాసికల్ మ్యూజికల్ సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈమె లతామా ఫౌండేషన్ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు.హిందుత్వం, భారతీయ సంస్కృతిపై అనర్గళంగా మాట్లాడగలరు. పాత బస్తీలో ఎవరికెలాంటి సమస్య వచ్చినా అందుబాటు లో ఉండేవారు. మాధవీ లతను ఎంఐఎం అధినేత అసద్ పైన బీజేపీ అభ్యర్దిగా పార్టీ బరిలోకి దించింది. ఆ ఎన్నికల్లో మాధవీ లతకు 323,894 ఓట్లు వచ్చాయి. గతం కంటే బీజేపీకి ఓట్లు పెరిగాయి. ఇక, ఇప్పుడు గోషామహల్ బాధ్యతలు మాధవీ లతకు ఇవ్వటం.. రాజాసింగ్ ప్రచారం లో ఉన్నట్లుగా శివసేనలో చేరితే పోటీ ఆసక్తి కరంగా మారటం ఖాయంగా కనిపిస్తోంది.
Social Plugin