Ticker

6/recent/ticker-posts

ఏపీలో మున్సిపల్‌ శాఖ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..!


ANDHRAPRADESH;ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ నాన్-పీహెచ్ వర్కర్లకు తీపికబురు అందించింది. రాష్ట్ర ప్రభుత్వం వారు నెలలుగా ఎదురుచూస్తున్న వేతనాల పెంపును ఆమోదించింది. నూతన గడిచిన జీవన వ్యయాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ నిర్ణయంతో వేలాది మంది కార్మికులు ఉపశమనం పొందనున్నారు.

పురపాలక పట్టణాభివృద్ధి శాఖ తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం..

కేటగిరీ-1 వర్గంలోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనం ప్రస్తుతం ఉన్న రూ.21,500 నుంచి రూ.24,500కి పెంచారు.

కేటగిరీ-2 వేతనం రూ.18,500 నుంచి రూ.21,500కి

కేటగిరీ-3 వేతనం రూ.15,000 నుంచి రూ.18,500కి పెంచుతూ ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది.

ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ కమిషనర్‌ అండ్ డైరెక్టర్‌కు అందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. తాజా నిర్ణయాన్ని అనుసరించి అన్ని మున్సిపాలిటీలలో, పట్టణ స్థానిక సంస్థలలో వేతన మార్పులు అమలవుతాయని భావిస్తున్నారు.

ఈ నిర్ణయం పట్ల మున్సిపల్ శాఖలో పని చేస్తున్న వేల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఉద్యోగుల మనోధైర్యాన్ని పెంపొందిస్తుందని, సేవల నాణ్యతను మెరుగుపరుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.