భారీగా హాజరైన జన సైనికులు..
ANDHRAPRADESH:జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా, ప్రతినిధి: వెనుక బడ్డ మన జంగారెడ్డిగూడెం ప్రాంతం అభివృద్ధి గురించే మొదటి నుంచీ నా తపన అని కాపునేత కరాటం రాంబాబు అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో గల అనుబంధంకొద్దీ అనేక పనులు సాధించాం..ఇపుడు సన్నిహితులు పవన్ కళ్యాణ్ తో జత కట్టామని, పార్టీకి మద్దతుగా
ఉన్నానని డిసిసిబి మాజీ చైర్మన్ ప్రముఖ కాపునేత కరాటం రాంబాబు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీతో అనుబంధం అనివార్య కారాణాల వల్ల తెగిపోయినందున ఏపార్టీలో లేనని చెప్పారు. అయితే గతం నుంచీ పార్టీలకు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కోసమే కృషి చేసానన్నారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జెడ్ పి టి సి సభ్యుడు పోల్నాటి బాబ్జి ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరిన సందర్బంగా ఆదివారం రాత్రి జంగారెడ్డిగూడెంలోని ఆలపాటి గంగా భవానీ కళ్యాణ మండపంలో అభినందన కార్యక్రమం జరిగింది. ఈ సభకు చింతలపూడి, పోలవరం, గోపాలపురం నియోజకవర్గాలకు చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు హాజరయ్యారు. భారీ సమూహాన్ని ఉద్దేశించి నాయకులు ప్రశంగించారు. చింతలపూడి జనసేన పార్టీ కన్వీనర్ మేకా ఈశ్వరయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది.
ముఖ్య అతిధిగావిచ్చేసిన కరాటం రాంబాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అన్ని రంగాల్లో వెనుకబడిన పోలవరం, చింతలపూడి నియోజకవర్గాలలో విద్య, వైద్యం సాగు నీరు వంతెనలు, వంటి ప్రధానమైన వాటిని లక్ష్యాలుగా చేసుకొని గత నలబై ఏళ్లుగా కృషి చేస్తున్నానన్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ తో గల సాన్నిహిత్యం కొద్దీ పోలవరం ప్రాజెక్టు కు ముందు కాల్వలతవ్వకం, పోగొండ రిజర్వాయర్, కొండ వాగులపై వంతెనలు నిర్మాణం కోసం ఆహార్నిశలు కృషి చేశానని అన్నారు. జంగారెడ్డిగూడెంలో నూరు పడకల ఆసుపత్రి, బుట్టాయగూడెంలో ఆసుపత్రి ఇలా అనేక కార్యక్రమాలు తాను పట్టుదలతో పూర్తి చేయించానన్నారు.
ఇటీవల ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోలవరం అభ్యర్థి బాధ్యత, గెలుపు బాధ్యత అప్పగించగా దాన్ని పూర్తి చేసానని పేర్కొన్నారు. పవన్ తనకు చిన్నతనం నుంచీ పరిచయం ఉందని తెలిపారు. తాజాగా
జనసేనలో చేరిన బాబ్జిని గతంలో సర్పంచ్ గా గెలిపించానని, తదుపరి జెడ్ పి టిసి గా ఏకగ్రీవంగా ఎన్నికకు కృషి చేసినట్టు తెలిపారు. కొయ్యలగూడెం జెడ్ పి టి సి గా ఇమ్మణ్ణి రాజేశ్వరిని ఏకగ్రీవంగా గెలిపించి ఆమె జెడ్ పి చైర్మన్ కావాలని చేశాన్నారు. బాబ్జి వంటి యువత గ్రామాల అభివృద్ధికి కృషి చెయ్యాలని వార్డు కమిటీల ద్వారా జనసేనను బలోపేతం చెయ్యాలని పిలుపు నిచ్చారు.
కరాటంమే రాజకీయ గురువు: బాబ్జి
డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ గ్రామాల పురోగతికి కృషి చేశారని, తాను ఆయన ఆశయాలతో ఏకీభవిస్తున్నానని అందుకే ఆయన సమక్షంలో చేరానని బాబ్జి తెలిపారు. తన మార్గదర్శకుడు కరాటం రాంబాబు ఆశీస్సులతో ఇంతటి వాడినయ్యానని భవిష్యత్ లోను ఆయన చూపిన మార్గంలో నిజాయితీగా పని చేస్థానని తెలిపారు. జనసేన పార్టీ ఇంచార్జి ఈశ్వరయ్య నిజాయితీగా ఉన్నారనే బాబ్జిని ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఇటీవల తన లారీలు కూడా అమ్మేశారని పేర్కొన్నారు. మట్టి తొలకంపై వైసీపీ ఆరోపణలు నిజం కాదని క్రమశిక్షణ గల పార్టీ జనసేన కాబట్టి ఆయన చేరారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో శ్రీనివాసపురం సర్పంచ్ రాధిక, వేగవరం సర్పంచ్ నాగరాజు, అక్కంపేట, వేగవరం. 2 ఎంపీ టిసి తదితరులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు జనసేనలో చేశారు. పట్టణ జనసేన అధ్యక్షుడు పీరు కౌన్సిలర్ వలవల తాతాజీ, మండల కమిటీ అధ్యక్షుడు ఆకుల రాకేష్, వీర మహిళ గుజ్జు ఉమా మహేశ్వరీ కరాటం ఉమా మహేశ్వరరావు, ముత్యాల తాతారావు, SR TV డైరెక్టర్ శింగంశెట్ఠి భార్గవ, పొల్నాటి నానీ, తదితరులు పాల్గొన్నారు.
Social Plugin