Ticker

6/recent/ticker-posts

ఇలా అయితే కష్టమే...మంత్రులకు తేల్చేసిన


బాబు ? చేతిలో కీలకమైన శాఖలు ఉన్నా వాటి మీద పట్టు పెంచుకోకుండా సమీక్షలు సైతం నిర్వహించకుండా చాలా మంది మంత్రులు ఉన్నారని బాబు అన్నారని అంటున్నారు. 

ANDHRAPRADESH:చంద్రబాబు వంటి అనుభవం కలిగిన వారి నాయకత్వంలో పని చేయడం మంత్రులకు ఒక విధంగా అదృష్టం. అదే సమయంలో వారికి ఇబ్బంది కూడా. ఎందుకంటే బాబు మార్క్ ఆలోచనలను తెలుసుకుని మసలుకోవడం కత్తి మీద సాము లాంటిది. వయసు రీత్యా బాబు ఏడున్నర పదులలో ఉన్నా ఆయన ఈ రోజుకీ డైనమిక్ గా ఉంటారు. రోజులో కనీసం పదిహేను గంటల పాటు అలుపు లేకుండా పనిచేయగలరు. టూర్లు కూడా తిరగగలరు. రోజుకు రెండు మూడు సమీక్షలు సులువుగా చేయడమే కాదు ప్రతీ శాఖ మీద ఏమి జరుగుతుందో తెలుసుకుంటూ బాబు అన్ని విధాలుగా ముందుంటున్నారు.


ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో చంద్రబాబు క్లాస్ తీసుకున్నట్లుగా చెబుతున్నారు. చాలా మంది మంత్రుల విషయంలో ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు అని అంటున్నారు. మీరు ఈ విధంగా ఉంటే కష్టమని బాబు చెప్పేశారు అని అంటున్నారు. ఏడాది పై దాటినా చాలా మంది మంత్రులు సబ్జెక్ట్ మీద అవగాహన పెంచుకోకపోవడం మీద ఫైర్ అయ్యారని అంటున్నారు కాలం మారుతోంది, రాజకీయం మారుతోంది అని కూడా వ్యాఖ్యానించారు అంటున్నారు.

ఒక అధికార పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే మీద వైసీపీ నేత దారుణంగా వ్యాఖ్యలు చేస్తే చాలా మంది మంత్రులు సైలెంట్ గా ఉండడం పట్ల కూడా చంద్రబాబు సీరియస్ అయ్యారని అంటున్నారు. స్పందించాల్సిన అవసరం ఉంది కదా అని ఆయన అన్నారని చెబుతున్నారు. అంతే కాదు వైసీపీ ప్రతీ విషయం మీద నానా యాగీ చేస్తూ రోడ్డు ఎక్కుతూంటే మంతులు ఎందుకు మౌనం పాటిస్తున్నారు అని ఆయన ప్రశ్నించారని అంటున్నారు. 

గతంలో చాలా మంది నాయకులను చూడామని కాంగ్రెస్ తో రాజకీయం చేయాలంటే సబ్జెక్ట్ ఉంటే సరిపోయేదని కానీ వైసీపీతో అలా కాదని బాబు వ్యాఖ్యానించారని చెబుతున్నారు. కౌంటర్లు ఎప్పటికపుడు ఇవ్వాల్సి ఉండగా చాలా మంది మత్రులు వెనకబడుతున్నారని బాబు అన్నట్లుగా తెలుస్తోంది. అసలు మంత్రులు ఏమి చేస్తున్నారో కూడా తనకు అర్ధం కావడం లేదని బాబు అన్నారట. అంతే కాదు విపక్షానికి సరైన సమాధానం చెప్పడంతో ఎందుకు ఫెయిల్ అవుతునారని ప్రశ్నించారని భోగట్టా.

ప్రభుత్వం మీద పార్టీ నేతల మీద వైసీపీ విమర్శలు చేస్తూ పోతున్నా పట్టదా అని బాబు అసహనం వ్యక్తం చేశారని అంటున్నారు. ఒక వైపు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను జనంలో పెట్టి చెప్పడంలోనూ చాలా మంది ఫెయిల్ అవుతున్నారని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు అంటున్నారు. అదే పనిగా వైసీపీ ప్రభుత్వం మీద చెడు ప్రచారం చేస్తోందని దానిని కౌంటర్ చేసే పరిస్థితి లేకుండా పోతే ఎలా అని బాబు అన్నారని చెబుతున్నారు.

చేతిలో కీలకమైన శాఖలు ఉన్నా వాటి మీద పట్టు పెంచుకోకుండా సమీక్షలు సైతం నిర్వహించకుండా చాలా మంది మంత్రులు ఉన్నారని బాబు అన్నారని అంటున్నారు. అంతే కాదు జిల్లాల పర్యటనలు మంత్రులు ఎందుకు చేయడం లేదని కూదా ఆయన అడిగారని చెబుతున్నారు. పొగాకు, మిర్చీ, మామిడి రైతులకు గిట్టుబాటు ధరలు ప్రభుత్వం కల్పిస్తున్నా కూడా ఏదీ జరగడం లేదని జగన్ వీధుల్లోకి వస్తున్నారని అయినా ఉన్న వాస్తవాలు చెప్పి ఆయనను ఎందుకు కౌంటర్ చేయలేకపోతున్నారు అని బాబు మంత్రుల మీద కాస్తా సీరియస్ అయినట్లుగా చెబుతున్నారు.

ఇదే తీరుగా ఉంటే మాత్రం తాను కూడా వేరేగా ఆలోచనలు చేయాల్సి ఉంటుందని బాబు హెచ్చరించారు అని అంటున్నారు మళ్లీ 1995 నాటి చంద్రబాబుని చూస్తారని వ్యాఖ్యానించారని చెబుతున్నారు. మొత్తానికి చూస్తే సరిగ్గా వ్యవహరించని మంత్రుల విషయంలో ఇది సీరియస్ గానే ఒక హెచ్చరిక అని అంటున్నారు. మరి చంద్రబాబు ఆలోచనలకు తగినట్లుగా వ్యవహరించని మంత్రులు ఎవరు వారి విషయంలో ఆయన ఏ విధంగా ముందు ముందు స్టెప్ తీసుకుంటారు అన్నదే రాజకీయంగా చర్చ సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.