మరోమారు కొండా మురళి సంచలన వ్యాఖ్యలు
ఇప్పటికే ఉమ్మడివరంగల్ జిల్లాలోని ఎమ్మెల్యేలైన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వరంగల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కుడాచైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియంశ్రీహరి తదితరులతో విభేదించి వారిపైన బాహాటంగానే విమర్శలు చేస్తున్న కొండామురళి తాజాగా మరోమారు సంచలన విషయాలు వెల్లడించారు.
గత ఎన్నికల్లో 70 కోట్లు ఖర్చు పెట్టానన్న కొండా మురళి
గత ఎన్నికలలో తను 70 కోట్లు ఖర్చు పెట్టానని ఆయన పేర్కొన్నారు. వరంగల్ లో ఆర్యవైశ్య సంఘం కార్యక్రమంలో పాల్గొన్న కొండా మురళి గత ఎన్నికల్లో తాను 70 కోట్లు ఖర్చుపెట్టి విజయం సాధించానని అన్నారు. తనకు 500 ఎకరాల భూమి ఉండగా ఎన్నికల కోసం 16 ఎకరాలు అమ్మవలసి వచ్చిందని పేర్కొన్నారు. రాజకీయ జీవితంలో ఉన్నత వర్గాల తోనే పోటీ పడ్డానని అన్నారు.
తాను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్న కొండా మురళి
వాసవి కన్యకా పరమేశ్వరి సాక్షిగా తనకు ఎవరి డబ్బులు అవసరం లేదని అన్నారు. తాను ఎవరిని ఇబ్బంది పెట్టలేదని, తాను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. కొండా మురళి తాజా వ్యాఖ్యలను బట్టి తాను ఎవరికి భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు.
ఎవరికీ భయపడనన్న కొండా వ్యాఖ్యలపై చర్చ
ఐదోతారీకు లోపు కొండ మురళి వరంగల్ జిల్లాలోని నాయకులపై తాను చేసిన వ్యాఖ్యలకు సమాధానం ఇవ్వవలసి ఉండగా, తాజాగా తాను ఎవరికీ భయపడను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారంగా మారాయి. ఇటు కొండ మురళి, అటు వరంగల్ జిల్లా నేతలు ఎవరికివారు తగ్గమని బాహాటంగానే గట్టిగా విమర్శలు చేస్తూ రాజకీయంగా తలపడుతుంటే భవిష్యత్తులో వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పోరు ఏ విధంగా మారుతుందో అన్నది విస్మయాన్ని కలిగిస్తుంది.
ఆందోళనలో వరంగల్ కాంగ్రెస్ఏ
ది ఏమైనప్పటికీ అధిష్టానం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని ఫుల్స్టాప్ పెట్టకపోతే ముందు ముందు వరంగల్ జిల్లాలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్నది ఆందోళన కలిగిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో వరంగల్ కాంగ్రెస్ లో రాజకీయ రగడ చిలికి చిలికి గాలివానగా మారటం ఆందోళన కలిగిస్తుంది.
Social Plugin