ANDHRAPRADESH:ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో నైరుతి రుతుపవనాలకి తోడు ఈశాన్య అరేబియా సముద్రం నుండి వాయువ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉండటంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఉత్తర గుజరాత్ నుంచి పశ్చిమ బెంగాల్ గంగా తీరంలోని ఉత్తర ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో వర్షాలు కురుస్తున్నాయి.
ఏపీలో
వర్షాలు మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్, జార్ఖండ్ మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ద్రోణి విస్తరించి కొనసాగుతున్న నేపథ్యంలో ఉత్తర కోస్తా, యానంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
నేడు ఈ జిల్లాలలో వర్షాలు
అయితే నేడు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచనల మేరకు నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం,విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, ఏలూరు,తూర్పుగోదావరి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
రాయలసీమలోనూ వర్షాలు
గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. అంతేకాదు రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం కూడా ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఇక దేశవ్యాప్తంగా రానున్న మూడు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఏపీలో పెద్దగా కురవని వర్షాలు
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ మాసంలో వర్షాలు బాగా కురుస్తాయని భావిస్తే, ఆశించిన మేర వర్షాలు కురవలేదు. ప్రస్తుతం జూలై మాసంలో వర్షాలు బాగా కురుస్తాయని భావిస్తున్న క్రమంలో వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వర్షాలు ఏవిధంగా కురుస్తాయి అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు రాష్ట్రంలో పెద్దగా ఆశించిన స్థాయిలో వర్షాలు పడిన దాఖలాలు అయితే లేవు.
Social Plugin