ANDHRAPRADESH;ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన పరిపాలన అందించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే గ్రామ పంచాయతీల స్థాయిలో ప్రజలకు ఎటువంటి సేవలు కావాలన్న వాట్సప్ ద్వారానే అందిస్తున్న ఏపీ ప్రభుత్వం, ఇప్పుడు పట్టణాలలో, నగరాలలో కూడా ప్రజల సమస్యల పరిష్కారానికి వేగంగా అడుగులు వేస్తోంది.
నగరాలు, పట్టణాల్లో సమస్యల కోసం అధికారుల చుట్టూ తిరగకుండా యాప్
నగరాలలో, పట్టణాలలో ఉన్న ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రజలు అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మొబైల్ ఫోన్ లోనే సమస్యను అధికారుల దృష్టికి తీసుకు వెళ్లే లాగా యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. పురపాలక శాఖ పురమిత్ర యాప్‌ను ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చి సమస్యల సాకారానికి కృషి చేస్తోంది . దీంతో సమస్య పరిష్కారం కోసం ఏపీ ప్రజలు అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోంది.
యాప్ లో వచ్చిన సమస్యలను పరిష్కరించకుంటే అధికారులదే బాధ్యత
యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని స్మార్ట్‌ఫోన్‌తో అక్కడి సమస్య తీవ్రత తెలిసేలా అప్‌లోడ్ చేస్తే 24 గంటల వ్యవధిలో సమస్యను పరిష్కరించేందుకు సిబ్బంది నేరుగా అక్కడికి వచ్చి సమస్యను పరిష్కరించి వెళతారు.పెద్ద పెద్ద సమస్యలైతే మూడు రోజుల నుంచి రెండువారాల్లో పరిష్కరిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 15న యాప్‌ను ప్రారంభించారు. గడువులోగా సమస్య పరిష్కారం కాకపోతే అందుకు అధికారులదే బాధ్యత.
సమస్యల ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తే అధికారులే నేరుగా వచ్చి పరిష్కరణ
కాబట్టి ఈ యాప్ ద్వారా సమస్యలను తెలియజేసిన వారికి, వాటిని పరిష్కరించటంలో అధికారులు అలసత్వం చూపించే అవకాశం లేదు. ఇప్పటివరకు 95 శాతం సమస్యలు గడువులోగా పరిష్కారమయ్యాయని సమాచారం. కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటున్నవారు పట్టణ ప్రాంతాలలో ఉన్న సమస్యలను పరిష్కరించడం లేదని లబోదిబోమనకుండా పురమిత్ర యాప్ ద్వారా సమస్యకు సంబంధించిన తీవ్రతను తెలియజేస్తూ ఫోటోలు అప్లోడ్ చేసి, సమస్యను అధికారుల దృష్టికి తీసుకుపోతే సమస్యకు పరిష్కారం త్వరితగతిని లభిస్తుంది.
పురమిత్ర యాప్ పై విస్తృత ప్రచారం
ఈ పుర మిత్రా యాప్ ను స్మార్ట్‌ఫోన్లలో ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్ డౌన్‌లోడ్ పై అధికారులు పట్టణాలు, నగరాల్లో విస్త్రతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ యాప్ వినియోగం పెరిగితే ప్రజలకు సేవలు అందించటం కూడా సులువు అవుతుందని భావిస్తుంది ప్రభుత్వం.
Social Plugin