ఈ నేపథ్యంలో కూటమిలో మరో కీలక భాగస్వామ్య పార్టీగా ఉన్న జనసేన కూడా ఇప్పుడు ప్రజల మధ్యకు వచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.
ANDHRAPRADESH:ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం పంచుకున్న టీడీపీ.. ఏడాది పాలనపై సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ప్రజల మధ్యకు వచ్చిన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు.. దీనికి 50 రోజుల పాటు సమయం నిర్దేశించారు. అయితే..ఆయన అనుకున్నంత రేంజ్‌లో కాకపోయినా.. మొత్తానికి కార్యక్ర మం అయితే.. సాగుతోంది. ఏడాది కాలంలో తాము ఏం చేశామన్న విషయాలను ప్రజలకు వివరిస్తున్నా రు. అంతేకాదు.. ప్రభుత్వం ప్రజలకు చేసిన మేళ్లను కూడా వివరిస్తున్నారు. పింఛన్లు, తల్లికి వందనం వంటి పథకాలను టీడీపీ తన ఖాతాలో వేసుకుంది.
ఇదే విషయాన్ని టీడీపీ నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు. పెట్టుబడులు వచ్చేందుకు.. చంద్రబాబు ఇమేజ్ కారణమని.. టీడీపీ నాయకులు చెబుతున్న విషయం తెలిసిందే. 'బాబు బ్రాండ్ ఇమేజ్' వల్లే రాష్ట్రానికి 10 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని మంత్రి నారా లోకేష్ కూడా చెబుతున్నారు. ఇక, పింఛన్ల విషయంలో సీఎం చంద్రబాబు నేరుగా ప్రజలకు చేరువ అవుతున్నారు. ప్రతి నెలా 1వ తేదీనే.. ఆయన ప్రజలను కలిసి.. పింఛన్లు ఇస్తున్నారు. ఇలా.. కూటమిలో ఉన్నా.. వ్యక్తిగతంగా పార్టీని డెవలప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కూటమిలో మరో కీలక భాగస్వామ్య పార్టీగా ఉన్న జనసేన కూడా ఇప్పుడు ప్రజల మధ్యకు వచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న జనసేన నేతలు, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. చేస్తున్న పనులు, తీసుకువచ్చిన సంస్కరణలను ప్రజలకు వివరించే ప్రయత్నాలు చేయాలన్నది ప్రధాన సంకల్పం. గ్రామీణ రహదారుల ఏర్పాటు, ఉపాధి హామీ పనులు పెంపు, అటవీ సంరక్షణ, గిరిజనప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన వంటివాటికి.. ఈ సందర్భంగా ప్రచారం కల్పించనున్నారు.
అంటే.. ఒక రకంగా.. కూటమిలో నే ఉన్నా.. ఎవరికి వారుగా తమ తమ గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పుకాదు. ఎవరికి వారువివాదాలు పెంచుకుంటే తప్పుకానీ.. తాము చేసిన పనులను ప్రజలకు వివరిస్తే తప్పులేద. ఇక, వచ్చే సెప్టెంబరు నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజల మధ్యకు వచ్చేందుకు సిద్ధమయ్యారని... పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనే ఆయన పర్యటన ఉంటుందని అంటున్నారు. దీనిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొంటారని అంటున్నారు.
Social Plugin