ఏసీ వెన్నెల స్లీపర్, నైట్ రైడర్, డాల్ఫిన్ క్రూయిజ్ పేరుతో ఏసీ సీటింగ్ కమ్ స్లీపర్ కోచ్ బస్సులను ప్రవేశపెట్టారు. సీటింగ్ ప్లస్ స్లీపర్ కోచ్ ఇది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మధ్య ఈ బస్సులు పరుగులు పెడుతోన్నాయి. వాటికి కూడా అంచనాలకు మించి ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తోంది. వారాంతపు, సెలవు రోజుల్లో సీట్లు దొరకని పరిస్థితి ఏర్పడిందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రయాణికులను మరింత ఆకట్టుకునేలా తాజాగా బస్ ఛార్జీలను తగ్గించారు. ఏసీ వెన్నెల స్లీపర్ సర్వీసుల్లో 20, ఇంద్ర బస్ సర్వీసుల్లో 15 శాతం వరకు ఛార్జీలు తగ్గాయి. ప్రస్తుతానికి అనంతపురం రీజియన్ లో ఇది అమలులోకి వచ్చింది. ప్రయాణికుల నుంచి లభిస్తోన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని క్రమంగా మిగిలిన రీజియన్లల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టే అవకాశాలు లేకపోలేదు.
అనంతపురం నుంచి విజయవాడకు వెళ్లే అన్ని ఇంద్ర బస్ సర్వీసుల్లో 15 శాతం ఛార్జీలు తగ్గాయి. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న ఛార్జీ 961 నుంచి 817 రూపాయలకు తగ్గింది.
అనంతపురం- చెన్నై, అనంతపురం- తిరుపతి మధ్య రాకపోకలు సాగించే అన్ని ఇంద్ర బస్ సర్వీసుల్లో 15 శాతం ఛార్జీలు తగ్గించారు. అనంతపురం- చెన్నై ఛార్జీ 832 నుంచి 708 రూపాయలకు తగ్గింది. అనంతపురం- తిరుపతి 579 నుంచి 493 రూపాయలకు తగ్గింది.
Social Plugin