Ticker

6/recent/ticker-posts

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఏపీలో వర్షాలు

ఈసారి దేశంలోకి ముందే ప్రవేశించి మురిపించిన నైరుతి రుతుపవనాలు ఆ తర్వాత ముఖం చాటేశాయి. దీంతో ప్రజలు వర్షాకాలంలోనూ వేసవి ఉక్కపోతను అనుభవించారు. ఈ నేపథ్యంలో భారత వాతావరణశాఖ ఒక చల్లని ప్రకటన చేసింది. మరో రెండ్రోజుల్లో రుతుపవనాలు దేశమంతటా వ్యాపిస్తాయని పేర్కొంది. 

పశ్చిమ మధ్య, సరిహద్దు వాయవ్య బంగాళాఖాతం సహా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉందని, కాబట్టి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది. అలాగే, ఈ శుక్రవారం ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.