జీడిమెట్లలో దారుణ ఘటన
ప్రేమ వ్యవహారంలో మందలించిన తల్లి
గొంతు పిసికి, తలపై రాడ్ తో కొట్టి చంపేసిన వైనం
HYDERABAD:హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలసి ఒక అమ్మాయి తన కన్నతల్లిని హతమార్చింది. ఆ అమ్మాయి (తేజశ్రీ) వయసు కేవలం 16 సంవత్సరాలు. పదో తరగతి చదువుతోంది. ఆమె ప్రియుడు శివ వయసు 19 సంవత్సరాలు.
తమ ప్రేమ వ్యవహారంలో తల్లి అంజలి (39) మందలించిందనే కోపంతో శివ, అతని తమ్ముడు యశ్వంత్ (18)తో కలిసి తేజశ్రీ కిరాతకానికి పాల్పడింది. వీరంతా కలిసి అంజలి గొంతు పిసికి, తలపై రాడ్ తో కొట్టి చంపేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేపట్టారు
Social Plugin