నైరుతి రుతుపవనాలు దేశమంతట విస్తరించాయి. నైరుతి రుతుపవనాలు విస్తరించిన కారణంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి. ఇక నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.
తెలంగాణాకు వర్ష హెచ్చరిక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలహీనపడుతుందని దీంతో తెలుగు రాష్ట్రాల్లో వరుసగా జూలై 1వ తేది వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల ప్రకారం నేడు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
నేడు ఈ జిల్లాలలో వర్షాలు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలలో అక్కడక్కడ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30నుంచి 40కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
రేపు వర్షాలు కురిసే జిల్లాలివే రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.
జూన్ 30న ఈ జిల్లాలలో వర్షాలు జూన్ 30వ తేదీన కూడా తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం, మహబూబాబాద్ వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
జులై 1న ఈ జిల్లాలలో వర్షాలు జులై 1వ తేదీన ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
జులై 2,3 తేదీలలోనూ వర్షాలకు చాన్స్ ఇక జూలై రెండవ తేదీన తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని, జూలై మూడవ తేదీన కూడా కొన్నిచోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే ఎక్కడా హెచ్చరికలు లేవని వాతావరణ శాఖ పేర్కొంది.
Social Plugin