ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యాధికారి, లెపర్సీ జిల్లా అధికారి ఆదేశాలు మేరకు ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ హెచ్ఐవిపై అవగాహన కళాజాత ఎల్ ఆర్ కృష్ణ బాబు మరియు వారి బృందం సాయంత్రం నాలుగు గంటలకు బుట్టాయిగూడెం సంత మార్కెట్ నుందు ఎమ్ పిడిఓ కార్యాలయం నందు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన మరియు ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయాలని ప్రతి ఒక్కరిని చైతన్యపరిచే రీతిలో చక్కని పాటలు మరియు వీధి నాటకాలు జనాకర్షణగా నిలిచాయి.
ఈ కార్యక్రమానికి ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు జిల్లా అధికారులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. హెచ్ఐవి అనేది అంటువ్యాధి కాదని, అంటించుకునేదని కలుషిత రక్త మార్పిడి వలన అక్రమ లైంగిక సంబంధాల వలన సూదులు సీరంజీల వలన ఇది వ్యాపిస్తుందని తెలిపారు. అలాగే అపరిచితులతో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు ఐతే తప్పనిసరిగా రక్త పరీక్ష ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రక్త పరీక్ష చేయించుకుంటే ఒక్క రూపాయి ఖర్చు కూడా ఉండదని వ్యాధి గల వ్యక్తులు పేరుని గోప్యంగా ఉంచుతారని, హెచ్ఐవి సోకినంత మాత్రాన భయపడవలసిన పనిలేదని, సక్రమంగా సకాలంలో మందులు వాడుతూ పౌష్టికాహారం తీసుకుంటే నిండు నూరేళ్లు హాయిగా జీవనం సాగించవచ్చని వివరంగా నాటికల ద్వారా తెలియ చెప్పారు.
ప్రచారంలో పాటల పాడుకుంటూ ఈ బృందం కళాజాత టీం లీడర్ ఎల్ ఆర్ కృష్ణ బాబు ప్రచారం కూడా చేయటం జరిగింది. సంత మార్కెట్లో బ్యానర్ పట్టుకొని డప్పుల వాయిద్యాలతో పాటలు పాడుకుంటూ సంత మార్కెట్ అంతా ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రచారం పలువురిని ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో బుట్టాయిగూడెం గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శి అలాగే పొటాటో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి సాయి సాగర్, ఆశా వర్కర్లు, ఏఎన్ఎం లు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
Social Plugin