ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం: స్థానిక శ్రీదేవి లాబ్ అధినేత గత నాలుగు దశాబ్దాలకుపైగా లాబ్ నిర్వాకులుగా, ఆర్ ఎంపీ గాను ఎంతో మందికి సేవలు అందించిన గూడూరు ఈశ్వర్(65) గురువారం రాత్రి 9:30 కు హార్ట్ అటాక్ తో మరణించారు.
మండలంలోని లక్కవరంకు చెందిన ఈశ్వర్ జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీదేవి లాబ్ పేరుతో వేలాది మందికి వైద్య సేవలు అందించారు. పట్టణ ప్రముఖులుగా సేవా తత్పరుడిగా గుర్తింపు పొందారు. మానవత సంస్థ సభ్యుడిగా గతంలో రోటరీ సభ్యుడిగా సేవలు అందించారు.
పలువురు ప్రముఖులు వీరి కుమార్తె శ్రీలత, కుమారుడు రాజేష్ లను మరియు కుటుంబ సభ్యులను పరామర్శించి ఈశ్వర్ భౌతిక కాయానికి నివాళులు అర్పించి సంతాపం తెలిపారు. తిరుమలాపురం సర్పంచ్ కనుపర్తి శ్రీనివాస్, వైఎస్సార్సీపీ మండల నాయకులు గురజాల పార్థసారధి మరియు చుట్టుప్రక్కల గ్రామాల నుండి మరియు పట్టణ మిత్రులు భౌతికకాయాన్ని సందర్శించి ఘననివాళి అర్పించారు.
Social Plugin