Ticker

6/recent/ticker-posts

వార్తలను వార్తలుగానే ఇవ్వాలి..: డిఎస్పీ రవి చంద్ర


సుమన్ టివి కార్యాలయం ప్రారంభ వేడుకలో డిఎస్పీ రవి చంద్ర

జంగారెడ్డిగూడెం, ప్రతినిధి: సెన్సషన్ కోసం ప్రయత్నాలు చేయకుండా నిజాయితీగా, నిబద్ధతతో వార్తలను వార్తలుగానే ప్రజలకు అందించాలని సుమన్ టివి కార్యాలయం ప్రారంభోత్సవంలో స్థానిక డిఎస్పీ కె రవిచంద్ర అన్నారు. స్థానిక సాయి బాలాజీ గ్రాండ్.2లో సుమన్ టివి ఏరియా కార్యాలయాన్ని డిసిసిబి మాజీ ఛైర్మన్ కరాటం రాంబాబు ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న డిఎస్పీ రవిచంద్ర మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సుమన్ టివి కూడా తమ కార్యకలాపాలను మొదలుపెట్టడం సంతోషమని శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే వాస్తవాలను తెలీజేయటంలో నిఖార్సయిన విధానం అమలు చేయాలని అన్నారు. మసిపూసి మారేడు కాయ చేసినట్టు సంచలనం కోసం పరుగులు తీయవద్దని పేర్కొన్నారు.


మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న కరాటం రాంబాబు అభివృద్ధి పథంలో పయనిస్తున్న జంగారెడ్డిగూడెం పట్టణాన్ని మోడల్ టౌన్ గా అభివృద్ధి కావాలని ఆకాంక్షించారు. పోలవరం ప్రాజెక్టు, చింతల పూడి ఎత్తి పోతల ప్రాజెక్టు వలన లక్ష మందికిపైగా నిర్వాసితులు ఈ ప్రాంతానికి వలస వచ్చారని అన్నారు. వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని అందుకు మీడియా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ నాయకుల్ని సరైన రీతిలో నడిపించే బాధ్యత మీడియా దేనని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త అలుగు ఆనంద శేఖర్ అధ్యక్షుడుగా వ్యవహరించేరు. సుమన్ టివి కార్యాలయంలో వివిధ విభాగాలను పెద్దలు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో సిఐ పి.రాజేష్, తెదేపా నేత చెలికాని సోంబాబు, ఎస్ ఆర్ టి వి అధినేత సింగం శెట్టి సత్యరాజ్, సుమన్ టి వి ఎపి చీఫ్ విజయ్, అనన్య చిత్రం డైరెక్టర్ బి.ప్రసాద్ రాజు, ఎపి డబ్ల్యూ జె ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె ఎస్ శంకర రావు తదితరులు పాల్గొన్నారు. అతిథులను సుమన్ టివి ఇంచార్జి బి.వేణు ఘనంగా సత్కరించారు. పాలవురు మిత్రులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

ఎస్ ఆర్ టివి అధి నేత సింగం శెట్టికి సత్కారం..

ఈ కార్యక్రమంలో త్వరలో జంగారెడ్డిగూడెం కేంద్రంగా ప్రారంభం కానున్న ఎస్ ఆర్ టి వి ఛానల్ అధినేత సింగం శెట్టి సత్యనారాయణ(సత్యరాజ్)ను ఈ సందర్భంగా ప్రముఖులు సన్మానించారు. కరాటం రాంబాబు, డిఎస్పీ రవి చంద్ర, అలుగు ఆనంద శేఖర్, కె ఎస్ శంకర రావు తదితరులు అభినందించారు.